
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి
మణుగూరురూరల్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ బుర్ర సోమేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కాంగ్రెస్ హయాంలోనే వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జి.వెంకటేశ్వర్లు, పెనుగొండ సాంబశివరావు, పొదిల వీరబాబు, ఎన్.సతీశ్, పి.రవి, ముత్యం రమేశ్, కవిత, బింగి రమాదేవి, జయమ్మ, శాంతమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.