
కిన్నెరసాని, తాలిపేరుకు వరద ఉధృతి
పాల్వంచరూరల్/చర్ల: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్‌లలో వరద నీరు చేరుతోంది. దీంతో శుక్రవారం తాలిపేరు ప్రాజెక్ట్ ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 30,821 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తుండగా, దిగువన ఉన్న తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, వరద ఉధృతి దృష్ట్యా 71.20 మీటర్లుగా కొనసాగిస్తున్నట్లు డీఈ తిరుపతి తెలిపారు. కాగా శుక్రవారం ప్రాజెక్టు వద్ద వర్షపాతం 31 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులుకాగా, ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో శుక్రవారం నీటిమట్టం 404.40 అడుగులకు పెరిగింది. దీంతో రాత్రి రెండు గేట్లను ఎత్తి ఉంచి నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు పర్యవేక్షణ ఇంజనీరు తెలిపారు.

కిన్నెరసాని, తాలిపేరుకు వరద ఉధృతి