
ముందస్తు జాగ్రత్తలు
భారీ
వర్షాలతో
సూపర్‌జార్(కొత్తగూడెం): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన సురేంద్రమోహన్ శనివారం హైదరాబాద్ నుంచి జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, యూరియా నిల్వలు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల మంజూరు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ గోదావరిలో ప్రస్తుతం 33అడుగుల వరద ప్రవా హం ఉందని, ముందస్తుగా రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌బృం దాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 100 మంది కానిస్టేబుళ్లకు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవా ల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఆపదమిత్ర వలంటీర్ల కోసం అగ్నిమాపక శాఖ సమన్వయంతో భద్రాచలం, పాల్వంచలలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏడు బోట్లు, మైకులు, రోప్, టార్చ్‌లైట్లు అందుబాటులో ఉన్నాయని, భద్రాచలం కరకట్టపై సైరన్ ఏర్పాటు చేశామని వివరించారు.
అందుబాటులో 3 వేల
మెట్రిక్ టన్నుల యూరియా
జిల్లాలో మూడువేల మెట్రిక్ టన్నుల యూరియా అం దుబాటులో ఉందని, వర్షం వల్ల ఖమ్మం నుంచి యూ రియా రావాల్సి ఉండగా, వర్షం వల్ల ఆలస్యమైందని తెలిపారు. అశ్వారావుపేటలో గుర్తించిన ఐదు యాడ్ బ్లూ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి యూరియా అక్రమ రవాణాను అడ్డుకుంటామని తెలి పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్‌కార్డులు వచ్చాయని, ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకువెళ్లారు.
7,747 ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్
జిల్లాలో 13,844 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా, 7,747 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని తెలిపారు. రిజ ర్వాయర్ల ద్వారా ఈసారి సీజన్‌లో 2.5 లక్షల ఎకరాల కు సాగునీరు విడుదల చేసేందుకు అవకాశం ఉందని వివరించారు. వనమహోత్సవంలో జిల్లాలో 70.65 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 35 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆగస్టు 15 నాటికి వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో 2,192 పాఠశాలల్లో గుడ్ల సరఫరా కోసం ఈ నెల 28న నోటిఫికేషన్ ఇస్తామని, ఆగస్టు 6న టెండర్లు ఓపెన్ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, సీపీఓ సంజీవరావు, హౌసింగ్ పీడీ రవీంద్రనాఽథ్, డీఏఓ బాబూరావు, డీఎస్‌ఓ రుక్మిణి, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్‌ఈ రవికుమార్, ఈఈ అర్జున్‌రావు పాల్గొన్నారు.
సిద్ధంగా రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ఆగస్టు 15 నాటికి వనమహోత్సవం పూర్తి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
విద్యార్థులతో మమేకం కావాలి
పాల్వంచ: విద్యార్థులతో మమేకం కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం ఆయన తెలంగాణా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, వసతిగృహాలు, భోజనంగది, మరుగుదొడ్లు, మంచి నీటివసతి సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి, వారితో కలిసి భోజ నం చేశారు. ‘బెస్ట్‌అవుట్ ఆఫ్ వేస్ట్’కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక వస్తువులను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోజనశాలలో బెంచీలు, కంప్యూటర్ ల్యాబ్‌లోఐరన్ స్టూల్స్ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో రూఫ్‌తో కూడిన టైల్స్ రోడ్ నిర్మిస్తామని చెప్పారు. ప్రిన్సి పాల్ మైథిలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.