
సమస్యాత్మక వ్యక్తులపై నిఘా పెట్టాలి
కొత్తగూడెంటౌన్: పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, సమస్యాత్మక వ్యక్తులపై నిఘా పెట్టాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. శనివారం రామవరంలోని టూటౌన్ పోలీసు స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆవరణను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను సీఐ ప్రతాప్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందిన దుమ్ముగూడెం సీఐ బి.అశోక్‌ను ఎస్పీ రోహిత్‌రాజు అభినందించారు. అశోక్ శనివారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛంఅందించగా, ఆయన అభినందనలు తెలిపారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టే అవకాశం ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇళ్ల పరిసరాలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన నిఘాకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీలు, కమ్యూనిటీల్లోకి ప్రవేశించే డెలివరీ బాయ్స్ ను వివరాలు సేకరించాకే అనుమతించాలని తెలి పారు. ఇంటి యజమానులు అద్దెకు ఉంటున్నవారి పూర్తి వివరాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతాయని వివరించారు.
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
సుజాతనగర్: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఓఎస్‌డీ గోపతి నరేందర్ సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఠాణా పరిసరాలను పరిశీలించి సిబ్బంది పలు సూచనలు చేశారు. సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఎం.రమాదేవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు