పాముకాటుతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Jul 29 2025 7:28 AM | Updated on Jul 29 2025 8:36 AM

పాముక

పాముకాటుతో మహిళ మృతి

పాల్వంచరూరల్‌: పంట చేలో పాముకాటుకు గురై ఓ మహిళ మృతిచెందింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనంప్రకారం.. మండలపరిధిలోని రెడ్డిగూడెం గ్రామపం చాయతీ ఎస్టీ కాలనీకి చెందిన పొడియం కోశయ్య, లక్ష్మి (45) దంపతులు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేస్తున్నారు. పంట చేలోనే నిద్రించగా, సోమవారం తెల్లవారుజామున లక్ష్మిని విషసర్పం కాటు వేసింది. దీంతో భర్త, స్థానికులు కలిసి నాటు మందు వేశారు. అయినా నయంకాకపోవడంతో 108లో పాల్వంచ ఆస్పత్రికి తీసుకవెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పాము కాటువేసిన ఏడుగంటల తర్వాత ఆమె చనిపోయింది. తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాటువైద్యం చేయించడంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా మృతురాలికి భర్త, ఇద్దరుకుమారులుఉన్నారు. ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేశారు.

అనుమానాస్పద స్థితిలో ఆర్‌ఎంపీ..

టేకులపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ గ్రామీణ వైద్యు డు ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లిలోని పాత సినిమా హాల్‌బజార్‌కు చెందిన యనగంటి రవికాంత్‌(36) ఆదివారం రాత్రి నిద్రి స్తున్న సమయంలో పెద్దశబ్దాలతో గురకపెట్టాడు. భార్య, తండ్రి గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందా డు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి అర్జున్‌రావు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు. మృతదేహాన్ని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె లక్ష్మీప్రసన్న తలకొరివి పెట్టి దహనసంస్కారాలు నిర్వహించింది. దహన సంస్కార ఖర్చు ల నిమిత్తం ఎస్‌ఐ, మాజీ సర్పంచ్‌ ఇస్లావత్‌ రెడ్యానాయక్‌ ఆర్థిక సాయం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ, సొసైటీ చైర్మన్‌ లక్కినేని సురేందర్‌, మాజీ సర్పంచ్‌ కోరం ఉమ తదితరులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పాల్వంచరూరల్‌: కుటుంబ కలహాలతో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. మండల పరిధిలోని రేగులగూడెం గ్రామానికి చెందిన పడిగ సతీష్‌ పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి 108 ద్వారా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

ట్రాక్టర్‌ అదుపుతప్పి డ్రైవర్‌కు గాయాలు

కరకగూడెం: మండలంలోని భట్టుపల్లి నర్సరీ నుంచి డ్రైవర్‌ కణితి ప్రవీణ్‌ ట్రాక్టర్‌లో మణుగూరుకు మొక్కలు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బంగారుగూడెం బ్రిడ్జి మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఓ గోతిలో పడింది. అటుగా వెళ్తున్నవారు గమనించి క్షతగాత్రుడిని పినపాక పీహెచ్‌సీకి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.

దొంగకు దేహశుద్ధి

బూర్గంపాడు: మండల పరిధిలోని సారపాక గ్రామపంచాయతీ భాస్కర్‌నగర్‌లో సోమవారం మధ్యాహ్నం ఓ దొంగకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పట్టపగలు ఓ ఇంటి ఆరుబయట నిలిపి ఉంచిన మోటార్‌ సైకిల్‌ను ఓ వ్యక్తి దొంగిలించి తీసుకెళ్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసి అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

చోరీ కేసు నమోదు

దమ్మపేట: మండలంలోని బాలరాజుగూడెం గ్రామంలో సోమవారం బంగారం చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పాయం పవన్‌కుమార్‌ పనిమీద దూర ప్రాంతానికి వెళ్లగా, అతడి భార్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. దీంతో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువా తెరచి బంగారం, వెండి అభరణాలను దొంగిలించారు. అభరణాల విలువ రూ.2,30,000 ఉంటుందని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

పాముకాటుతో మహిళ మృతి1
1/1

పాముకాటుతో మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement