
ప్రమాదాలపై అవగాహన కల్పించాలి
భద్రాచలంఅర్బన్: రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సూచించారు. సోమవారం ఆయన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో పరిసరాలను, రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేకూర్చాలని, బాధ్యతగా మెలగాలని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా పట్టణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా ఠాణాలో మొక్కలు నాటారు. ట్రాఫిక్ ఎస్‌ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్ర కమిటీ సభ్యుడిగా లక్ష్మణరావు
మణుగూరు టౌన్: అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ కేంద్ర కమిటీ సభ్యుడిగా మణుగూరుకు చెందిన కొమరం లక్ష్మణ్‌రావును నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు శంకర్ బోదత్ నియామక పత్రం అందజేశారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్బంగా లక్ష్మణరావు తెలిపారు.
పీకే ఓసీలో
నూతన యంత్రాలు..
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరి యాలోన పీకే ఓసీలో రూ.9.32 కోట్ల విలువైన భారీ క్రేన్, షావల్‌ను సోమవారం జీఎం దుర్గం రాంచందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంత్రాల వినియోగంపై అధికారు ల పర్యవేక్షణ ఉండాలన్నారు. భారీ యంత్రాలను నడిపేందుకు సీనియర్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాసచారి, శ్రీనివాస్, లక్ష్మీపతిగౌడ్, వెంకటరామారావు, రాంబాబు, అనురాధ, శివ ప్రసాద్, వీరభద్రుడు, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ రాంగోపాల్, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు పాల్గొన్నారు.

ప్రమాదాలపై అవగాహన కల్పించాలి

ప్రమాదాలపై అవగాహన కల్పించాలి