
వ్యక్తి అదృశ్యం
టేకులపల్లి: వ్యక్తి అదృశ్యంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకా రం.. మండలంలోని మద్రాస్ తండాకు సుతారి మేసీ్త్ర బానోత్ సూర్యం ఈ నెల 10న సుతారి పనికి కొత్తగూడెం వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేదు. సూర్యం భార్య శౌరి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేందర్ తెలిపారు.
పశువులు స్వాధీనం
ఇల్లెందు: మండలంలోని కొమరారం ఏరియా నుంచి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్న 11 పశువులను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. 21 ఏరియాలో పశువుల వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించారు.