రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Jul 27 2025 6:48 AM | Updated on Jul 27 2025 6:48 AM

రామయ్

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజ లు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించా రు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

ఓటర్ల జాబితా

పకడ్బందీగా ఉండాలి

ఇల్లెందురూరల్‌: గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితా పకడ్బందీగా ఉండాలని జిల్లా పంచాయతీ అఽధికారి చంద్రమౌళి సూచించారు. మండలంలోని సుభాష్‌నగర్‌, సుదిమళ్ల గ్రామపంచాయతీల్లో ఓటరు మెర్జింగ్‌ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక కుటుంబంలోని సభ్యులు ఒకే వార్డులో ఉండేలా మెర్జింగ్‌ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. ఎంపీవో చిరంజీవి, పంచాయతీ కార్యదర్శులు రజినీకాంత్‌, అజహర్‌ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన లైసెన్స్‌డ్‌

సర్వేయర్ల శిక్షణ

నేడు 380 మందికి పరీక్షలు

చుంచుపల్లి: లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించేందుకు ప్రభుత్వం చేపట్టిన శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. గత మే 26 నుంచి కొత్తగూడెం మైనింగ్‌ కళాశాలలో 380 మందికి 50 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆదివారం సింగరేణి ఉమెన్స్‌ డిగ్రీ కళాశాలలో రాత పరీక్షలు, ఈ నెల 28, 29వ తేదీల్లో ఫీల్డ్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే అభ్యర్థులకు సర్వేయర్‌ లైసెన్స్‌ ఇవ్వనున్నారు. కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేయడం వంటి చర్యల నేపథ్యంలో ప్రభుత్వం పలువురు అభ్యర్థులను ఎంపిక చేసి సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చింది.

ఆరోగ్య శ్రీ ద్వారా ఈఎన్‌టీ శస్త్రచికిత్స

ఇల్లెందు: ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో శనివా రం ఆరోగ్య శ్రీ పథకంలో ఈఎన్‌టీ శస్త్రచికిత్స నిర్వహించారు. పట్టణంలోని రైటర్‌ బస్తీకి చెందిన 17 ఏళ్ల ఖ్యాతికి ముక్కులో కండరం పెరగడంతో శ్వాస సమస్య ఎదురైంది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా సుమారు రూ.40 వేలు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు సునీత–జయబాబు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా ఈఎన్‌టీ డాక్టర్‌ రవి తేజస్వీ వైద్య పరీక్షలు నిర్వహించింది. శనివారం డాక్టర్‌ రవి తేజస్వీ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఫర్జానా, నర్సింగ్‌ సిబ్బంది భారతి, లలిత రెండు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ముక్కు దూలం వంకర సరిచేయటంతో ముక్కులో పెరిగిన కండరాన్ని తొలగించారు.

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన1
1/3

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన2
2/3

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన3
3/3

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement