
బంజారాల బతుకమ్మ తీజ్
● ప్రకృతితో ముడిపడిన పండుగ ● గిరిజన గ్రామాల్లో మొదలైన సందడి ● తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు
జూలూరుపాడు: గిరిజన బంజారుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్ ఉత్సవాలు జిల్లా లోని గిరిజన తండాల్లో వైభవంగా జరుపుకోనున్నారు. శ్రావణ మాసం శుక్రవారం నుంచి తీజ్‌ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ఆషాఢ మాసంలో సీత్లా జరుపుకోగా, తరువాత ప్రకృతితో ముడిపడి ఉన్న తీజ్‌ను జరుపుకుంటారు. మొలకల పండుగ అని పిలిచే ఈ తీజ్ బతుకమ్మను పోలి ఉంటుంది. పెళ్లి కాని ఆడపడుచులు ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తొమ్మిది రోజుల వేడుక
బతుకమ్మ ఉత్సవాల మాదిరిగానే తీజ్ ఉత్సవాలు 9 రోజుల పాటు సాగుతాయి. పెళ్లికాని ఆడపడుచు లు తండా పెద్ద అనుమతితో వెదురుబుట్టలో ఎర్ర మట్టి, ఇసుక, ఎరువు పోసి నానబెట్టిన గోధుమలు, వేరుశనగలు విత్తుతారు. 9 రోజులపాటు యువతులు ఉపవాస దీక్షతో నీళ్లు పోస్తూ, ఆటపాటలతో గడుపుతారు, పెళ్లికాని యువతులే కాకుండా తండాలోని మహిళలంతా ఒక్కపూట భోజనంచేస్తారు. ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన మంచైపె వెదురు బుట్టల్లో నీళ్లు పోసి రోజూ ఆటపాటలతో పూజలు నిర్వహిస్తారు. పెళ్లికాని యు వతులు తమకు మంచిభర్తలు రావాలని, తండా ప్రజలందరూ సుఖసంతోషాలుతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి బాగా పంటలు పండాలని ఆకాంక్షిస్తారు. బుట్ట ల్లోని గోధుములు, వేరుశనగ గింజలు మొలకెత్తాక, 9వ రోజు తీజ్ బుట్టలను మంచె పైనుంచి కిందకు దించి, బుట్టల్లోని నారును తెంచుతారు. ఈ నారు ను పెద్దలు, అన్నదమ్ముల చెవుల్లో పెట్టి యువతు లు ఆశీస్సులు పొందుతారు. తర్వాత ఆటపాటల తో తీజ్ బుట్టలను యువతులు, మహిళలు ఊరేగింపుగా తీసుకెళ్లి వాగులు, వంకలు, చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు.
పంటలు పండాలని..
ఈ పండుగ ముఖ్య ఉద్దేశం పాడి, పంటలు పండాల ని, ఆయూరారోగ్యాలతో ప్రజలంతా ఉండాలని, పెళ్లి కానీ యువతులకు వివాహం జరగాలని. తీజ్ ఉత్సవా ల్లో భాగంగా మొలకలు వచ్చిన వెదురు బుట్టలతో పాటు, ప్రత్యేకంగా తయారు చేసిన శివలింగాన్ని పల్లికీలో ఉంచి, దానిని యువతులు మోస్తూ గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. గిరిజనమహిళలు, యువతు లు సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న బంజార తండాల్లో తీజ్ ఉత్సవాలను గిరిజన ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 18వశతాబ్దంలో గుండియా అనే వ్యక్తితో బంజారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పెద్ద లు చెబుతారు. సేవాలాల్ మహరాజ్ సూచనతో గుండియాను రాఖీపౌర్ణమిరోజు సంహరించారని, అందుకు గుర్తుగా రాఖీపౌర్ణమి రోజునగుండియా దిష్టిబొమ్మను దహనం చేసి తీజ్ పండుగను యువతులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. తీజ్ పండుగను రాజస్తాన్ మొదలు అన్ని రాష్ట్రాల్లోని బంజారులు ఘనంగా జరుపుకుంటున్నారు.
ఆనందంగా జరుపుకుంటాం..
తీజ్ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఆనందంగా జరుపుకుంటాం. పెళ్లికాని యువతు లు, మహిళలు తీజ్ బుట్టల్లోని విత్తనాలకు తొమ్మిది రోజులపాటు నీళ్లు పోసి, ఆటపాటలతో పూజలు చేస్తారు. తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేస్తాం. తీజ్ బుట్టలు ఏర్పాటు చేసిన వారంతా రోజూ శాఖాహారం తింటారు. –భూక్యా నవ్య, జూలూరుపాడు మండలం
మాకిదే బతుకమ్మ
బంజారాల సంస్కృతి, సంప్రదాయాల పండుగ తీజ్. పెళ్లికాని యువతులు మంచి భర్త రావాలని, అన్నదమ్ములు, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. తీజ్ బుట్టలను ఆఖరి రోజు చెరువులో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. మాకు ఇదే బతుకమ్మ పండుగ.
–బానోత్ లక్ష్మి, జూలూరుపాడు మండలం

బంజారాల బతుకమ్మ తీజ్

బంజారాల బతుకమ్మ తీజ్

బంజారాల బతుకమ్మ తీజ్