
● చిన్న కుటుంబాలుగా మారిన సమాజం ● అమ్మ, నాన్న, ఒక్కరిద్
ఇల్లెందురూరల్/నేలకొండపల్లి: సమాజంలో ఆర్థిక పరిస్థితులు, స్వార్థం, నేను అనే భావన వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. నేడు కుటుంబం అంటే భార్య, భర్త, వారి ఒకరిద్దరు సంతానం మాత్రమే. ఇలాంటి కుటుంబాలు ఆర్థికంగా బలపడినా మానసికంగా మాత్రం బలహీనపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఆయా కుటుంబాల పిల్లల మానసిక పరిపక్వత ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. చిన్న కుటుంబాల్లో మంచి మాటలు చెప్పే పెద్దలు లేకపోవడంతో పిల్లలు టీవీ, సెల్‌ఫోన్‌లకు బానిసలవుతున్నారు. ఇది వారి ఆరోగ్య స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతోంది.