
ఆధార్ క్యాంపునకు విశేష స్పందన
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో మూడురోజులపాటు నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వివరాలు వెల్లడించారు. మొత్తం 3,772 సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ఇందులో కొత్త నమోదులు 489, వయోవృద్ధుల సేవలు 45, దివ్యాంగుల నమోదు 12, ట్రాన్స్‌జెండర్ నమోదు 1, బయోమెట్రిక్, ఇతర అప్డేట్లు 602, పుట్టిన తేదీ సవరణలు 5, ఆధార్ రద్దు కేసులు 2, సాధారణ ఎంకై ్వరీలు 50, మరికొన్ని ఇతర సమస్యలకు పరిష్కారం లభించిందని వివరించారు. క్యాంపునకు 10 వేల మందికి పైగా హాజరయ్యారని తెలిపారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివారు ధ్రువీకరణ పత్రాలు పొంది మీ సేవా కేంద్రాల ద్వారా ఆధార్ నవీకరణ చేసుకోవాలని సూచించారు. మండలాల వారీగా నిర్వహించే మెగా ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని ఆధార్ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. క్యాంపు విజయవంతానికి సహకరించిన రాష్ట్ర యుఐడీఈ బృందం, ఈ డిస్ట్రిక్ట్ మేనేజరు సైదేశ్వరరావు, రెవెన్యూ, ఐటీ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
3,772 సమస్యలకు పరిష్కారం

ఆధార్ క్యాంపునకు విశేష స్పందన