
గోదావరి పరవళ్లు..
వాతావరణ ం
జిల్లాలో శనివారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది.
రాత్రి 11 గంటలకు 38.8 అడుగుల వరద
● అప్రమత్తమైన జిల్లా ఉన్నతాధికారులు ● పర్ణశాలలో నీట మునిగిన సీతమ్మవారి నారచీరల ప్రాంతం
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు వేస్తోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం తరలివస్తోంది. గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 36.80 అడుగులకు, రాత్రి 11 గంటలకు 38.8 అడుగులకు చేరింది. ఇంకా వరద పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా ఉన్నతాధికారులు స్థానిక అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం, తాలిపేరు ప్రాజెక్ట్‌ల నుంచి వరద నీటిని దిగువకు వదులు తున్నారు. దీంతో గురు, శుక్రవారాల్లో గోదావరి ఉధృతి పెరిగింది. గురువారం 23 అడుగులు ఉన్న గోదావరి శుక్రవారం ఉదయం 7 గంటలకు వేగంగా 33.5 అడుగులకు చేరుకుంది. ఉదయం 11 గంటలకు 35, సాయంత్రం 5 గంటలకు 36.8, రాత్రి 11 గంటలకు 38.8 అడుగులకు వచ్చింది. భద్రాచలం వద్ద స్నానఘట్టాలు, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం నీట మునిగాయి. కాగా భద్రాచలం వద్ద 43 అడుగులకు మొదటి, 48 అడుగులకు రెండో, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తారు.
అప్రమత్తం చేసిన అధికారులు
మొదటి ప్రమాద హెచ్చరిక వైపు గోదావరి పరుగులు పెడుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నది ఒడ్డున ఉన్న స్లూయిస్ పాయింట్ల వద్ద భారీ మోటార్లను సిద్ధం చేశారు. కరకట్టకు ప్రమాదం జరగకుండా ఇసుక బస్తాలను అమర్చారు. హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ
భద్రాచలం అర్బన్: గోదావరిలో నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. శుక్రవారం కరకట్ట వద్ద వరదను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సహాయక చర్యల కోసం ఐదు డీడీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.
పరీక్షించి.. పదును పెట్టి..
విద్యార్థుల స్థాయి అంచనాకు ‘బేస్‌లైన్’ ‘మిడ్‌లైన్’ ‘ఎండ్‌లైన్’ పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టారు.
8లో
న్యూస్‌రీల్

గోదావరి పరవళ్లు..

గోదావరి పరవళ్లు..

గోదావరి పరవళ్లు..