
గాలి వాన బీభత్సం
జూలూరుపాడు/టేకులపల్లి: జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం, సాయిరాంతండా, వీరభద్రాపురం, సురారం, గుండెపుడి, నల్లబండబోడు, వినోభానగర్, జడలచింత, పాపకొల్లు, భోజ్యాతండా, కొత్తూరు, పెద్దహరిజనవాడ, అన్నారుపాడు, గుండ్లరేవు, భేతాళపాడు, టేకులపల్లి మండలంలోని సులానగర్‌తోపాటు పలు గ్రామాల్లో గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో రహదారిపై అడ్డంగా పడిపోయిన చెట్లను తొలిగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వీరభద్రాపురం గ్రామానికి చెందిన పద్దం సావిత్రి, గుండ్లరేవుకు చెందిన చిరంజీవి సులానగర్‌కు చెందిన బాణోతు బుచ్చి ఇంటి పైకప్పు (రేకులు)లు గాలికి ఎగిరిపోయాయి.

గాలి వాన బీభత్సం