
యువజన సంఘాల పాత్ర కీలకం
ములకలపల్లి: దేశ రక్షణలో విద్యార్థి యువజన సంఘాల పాత్ర కీలకమని ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శులు కల్లూరి ధర్మేంద్ర, ఇటుకల రామకృష్ణ, వేముల కొండల్‌రావు అన్నారు. ములకలపల్లిలోని రాయల్ కన్వెన్షన్ హాల్‌లో గురువారం ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ప్రజా నాట్య మండలి బాధ్యుల వర్క్‌షాప్ నిర్వహించారు. లౌకిక భారతావనిలో మతం పేరుతో చిచ్చులు పెట్టడంతో ఉగ్రమూకలు ప్రజలపై ఆకస్మిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు దేశంలో మారణహోమం సృష్టిస్తున్నాయన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, బీకేఎంయూ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉప్పుశెట్టి రాహుల్, హరీశ్, అజిత్, ఎండీ యూసుఫ్, నరాటి రమేశ్, జబ్బార్, అనుమల సాయి తదిరులు పాల్గొన్నారు.
గిరిజనుల రుచులతో ఆకట్టుకోవాలి
భద్రాచలంటౌన్: ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకులను గిరిజనుల రుచులతో ఆకట్టుకోవాలని ఏపీఓ డేవిడ్‌రాజ్ అన్నారు. మ్యూజియం ప్రాంగణంలో స్టాళ్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులతో వంటకాల తయారీపై గురువారం తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. స్టాళ్ల నిర్వాహకులు పరిశుభ్రత పాటించి నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. స్టాళ్ల ఎదుట కూర్చోవడానికి సౌకర్యాలు కల్పించడంతో పాటు తినుబండారాలు తయారు చేస్తున్న సిబ్బంది చేతులకు గ్లౌజులతో పాటు, తలకి రక్షణ కవచాలు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ప్రతీది ఎంఆర్‌పీకే విక్రయించాలని, పర్యాటకులు కోరిన తినుబండారాలు అధిక ధరకు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే ఆ స్టాల్‌ను తొలగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, గిరిజన స్టాళ్ల నిర్వాహకులు సుధారాణి, రాజేందర్, భూలక్ష్మి, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను
త్వరితగతిన పూర్తిచేయాలి
పాల్వంచరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. మండలంలోని తోగ్గూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌజింగ్ పీడీ శంకర్‌తో కలిసి గురువారం ఆయన పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. పనుల వివరాలు, డబ్బుల జమ గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య ఉందని చెప్పగా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. హౌజింగ్ బోర్డు ఏఈ రమేశ్, గ్రామ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు బీట్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం రేంజ్ పరిధిలోని మర్రిగూడెం సెక్షన్ ఎల్లాపురం బీట్ అధికారి చంద్రయ్య, సర్వాపురం బీట్ అధికారి నగేశ్‌ను సస్పెండ్ చేస్తూ డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మర్రిగూడెం గ్రామ పంచాయతీ ఎల్లాపురం గ్రామ శివారులో అటవీ భూమికి పక్కనే సాగు చేసుకుంటున్న రైతులు సరిహద్దు ప్రాంతంలో పోడు నరకడాన్ని బీట్ అధికారుల నిర్లక్ష్యంగా నిర్ధారించి, అందుకు బాధ్యులైన ఇద్దరు బీట్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో డీఎఫ్‌ఓ పేర్కొన్నారు.
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
కొత్తగూడెంఅర్బన్: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. 5వ వార్డు నర్సు క్వార్టర్స్ ఏరియాలో ఇంటి ముందు గురువారం ఆడుతున్న బాలుడిపై రెండు కుక్కలు దాడి చేయగా చేతికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి.. బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

యువజన సంఘాల పాత్ర కీలకం

యువజన సంఘాల పాత్ర కీలకం

యువజన సంఘాల పాత్ర కీలకం