ప్లాంటేషన్‌ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ప్లాంటేషన్‌ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు

May 24 2025 12:37 AM | Updated on May 24 2025 12:37 AM

ప్లాం

ప్లాంటేషన్‌ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు

అశ్వాపురం: అశ్వాపురం ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధి తుమ్మలచెరువు బీట్‌లోని పాలవాగు సమీపంలో ప్లాంటేషన్‌ నరికివేతపై అటవీశాఖ అధికారులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుర్వాపల్లి కొత్తూరుకు చెందిన కొందరు గిరిజనులు రెండు రోజులుగా ఫారెస్ట్‌ అధికారులు నిర్ణయించిన కందకాలు దాటి ప్లాంటేషన్‌లోని చెట్లను నరికివేస్తున్నా రు. దీంతో అటవీశాఖ సిబ్బంది రెవెన్యూ, పోలీసులు దృష్టికి తీసుకెళ్లగా, తహసీల్దార్‌ రాజారావు, ఎస్సైప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులతో మాట్లాడి పోడు నరకవద్దని సూచించారు. అనంతరం ప్లాంటేషన్‌ నరికివేతకు పాల్పడిన వారిని ఫారెస్ట్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో అశ్వాపురం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఎస్‌ రమేష్‌ , సెక్షన్‌ ఆఫీసర్‌ నాగరాజు, మణుగూరు సబ్‌ డివిజన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంకుడు గుంతలు

నిర్మించాలి

జూలూరుపాడు: రహదారుల పక్కన ఇంకుడు గుంతలు నిర్మించాలని డీపీఓ చంద్రమౌళి సూచించారు. శుక్రవారం ఆయన జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామాల్లో తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మిస్తున్న ఇంకుడు గుంతల ను పరిశీలించి మాట్లాడారు. ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల వర్షపు నీరు నేలలోకి ఇంకి భూగర్భజల మట్టం పెరుగుతుందని, నీటి కొరత తగ్గుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జూలూ రుపాడు ఎంపీఓ టి.తులసీరామ్‌, వెంగన్నపాలెం పంచాయతీ సెక్రటరీ జి లక్ష్మణ్‌, జీపీ కార్మికులు పాల్గొన్నారు.

నూతన పద్ధతులు

పాటించాలి

దమ్మపేట: బోధనలో నూతన పద్ధతులు పాటించాలని జిల్లా స్థాయి విద్యాశాఖ రిసోర్స్‌ పర్సన్‌ శంకర్‌ ఉపాధ్యాయులకు సూచించారు. పట్వారిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఐదు రోజులుగా జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. శిక్షణను సద్వినియో గం చేసుకుని, బోధనలో నూతన ఒరవడికి శ్రీ కారం చుట్టాలని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బోధనలో ఏఐ విధానాలను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమికస్థాయి గణిత బోధనలో సీపీఏ పద్ధతి అనుసరించాలని, పాఠ్యాంశాల బోధనలో ఎక్కువగా కృత్యధార పద్ధతులను ఉపయోగించాలని వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ కీసర లక్ష్మి, ఎంఆర్పీలు రామకృష్ణ, రవి, ప్ర భాకర్‌, షారోన్‌ కుమార్‌, సౌమ్య, కృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

తల్లాడ: మండలంలోని మల్లవరంలో శుక్రవారం విద్యుదాఘాతంతో ట్రాక్టర్‌ డైవర్‌ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంభగిరి బలరాం (45) దళితకాలనీ సమీపాన ఉన్న చికెన్‌ షాపు వెనకాల మూత్ర విసర్జనకు వెళ్లాడు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్‌ వైర్‌ను తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మధ్యాహ్నం ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బలరామ్‌కు భార్య సుశీల, ఇద్దరు పిల్లలు ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

17 మందికి జరిమానా

కొత్తగూడెంఅర్బన్‌: మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి శుక్రవారం కొత్తగూడెం స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మెండు రాజమల్లు జరిమానా విధించారు. కొత్తగూడెం వన్‌ టౌన్‌, అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి విచారణ చేపట్టి జరిమానా విధించారు.

ప్లాంటేషన్‌ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు1
1/2

ప్లాంటేషన్‌ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు

ప్లాంటేషన్‌ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు2
2/2

ప్లాంటేషన్‌ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement