
భార్యపై కత్తితో దాడి
కొత్తగూడెంఅర్బన్: ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. వైరాకు చెందిన మాధవరావు, లావణ్య దంపతులు. భర్త మాధవరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నదనే కారణంతో లావణ్య కొంతకాలంగా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్‌లోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మాధవరావు అత్తగారి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కత్తితో గొంతుపై గాయపరి చాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా గాయపరిచాడు. లావణ్యకు రక్తస్రావం అవుతుండగా కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్‌లు ఢీ : ఆరుగురికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. బోయితండా గ్రామపంచాయతీ సేవ్యాతండాగ్రామానికి చెందిన గంగావత్ మోహన్ ఖమ్మలోఆర్టీసీ డ్రైవర్‌గా ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామంలో ఓ శుభకార్యానికి హా జరై తిరిగి భార్య లలిత, కుమార్తె రాజేశ్వరిలతో కలిసి బైక్‌పై ఖమ్మం బయలుదేరాడు. అదే సమయంలో ధనియాలపాడు గ్రామానికి చెందిన చరణ్, సాగర్, శ్రావ్య ముగ్గురు బైక్‌పై ఇల్లెందు నుంచి కొమరారం వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో మోహన్, లలిత, రాజేశ్వరిలు తీవ్రంగా గాయపడ్డారు. చరణ్, సాగర్,శ్రావ్యలకు స్వల్పంగా గాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మసిఫారసు చేశారు. బాధితుల ఫిర్యాదుమేరకుఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు.