
అశోక్‌నగర్‌లో నివాసాల కూల్చివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీలో ఉన్న 41 నివాసాలను శనివారం గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేశారు. కాగా, ఈ ఇళ్లలో ఉండేవారికి రాష్ట్ర ప్రభత్వం గత నెలలో డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించిందని, ఈ ప్రాంతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జామాయిల్ మొక్కలను నాటి, సంరక్షించనున్నామని గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.
ఓయూ నుంచి డాక్టరేట్
సత్తుపల్లి: సత్తుపల్లిలోని గీతమ్స్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, అశ్వారావుపేట మండలం ఆసుపాకకు చెందిన కునుసోతు అశోక్‌కుమార్‌కు డాక్టరేట్ లభించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభా గం ప్రొఫెసర్ డాక్టర్ బి.రమాదేవి పర్యవేక్షణ లో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఓయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. వేరుశనగలో వచ్చే కాండం కుళ్లు తెగులును తక్కువ ఖర్చుతో, సైడ్ ఎఫెక్టులు లేకుండా నిరోధించేలా చేసిన పరిశోధనలపై అశోక్‌కుమార్ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను గీతమ్స్ కళాశాల డైరెక్టర్ దొడ్డా శ్రీనివాసరెడ్డి, శాంతినికేతన్ కళాశాల ప్రిన్సిపాల్ మమంద్రారెడ్డి తదితరులు అభినందించారు.
ట్రాక్టర్ ఢీకొని
కార్మికులకు గాయాలు
పాల్వంచ: ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు మున్సిపల్ కార్మికులకు గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని దమ్మపేట సెంటర్ వద్ద శనివారం పారిశుద్ధ్య పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికులు బొమ్మన కిరణ్, ఇందులను ట్రాక్టర్ ఢీ కొనడంతో స్వల్పగాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ముగిసిన పీఈటీల శిక్షణ
టేకులపల్లి: జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులకు గత ఐదు రోజులుగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. 100 మంది పీఈటీలు శిక్షణకు హాజరయ్యారు. కోర్సు ఇన్‌చార్జ్‌గా మెరుగు శ్రీనివాస్ వ్యవహరించగా రిసోర్స్ పర్సన్లు నరేష్‌కుమార్, శ్రీనివాసరావు, రామనాథం, కవిత వ్యాయామ విద్యకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఇంకా మోటివేషన్, ఫిజియోథెరపీ, సీపీఆర్, నైతిక విలువలు, నేరాలు – వాటి నివారణ తదితర అంశాలపై హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బి.మాధురి, జవ్వాది వెంకటేశ్వరబాబు, షీ టీమ్ ఎస్‌ఐ రమాదేవి, శ్రీజ బోధించారు.
కేసు నమోదు
ఇల్లెందు: పట్టణంలోని ఆదిత్య ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణంలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇల్లెందు ఎస్‌ఐ పి.శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. గత ఆదివారం అర్ధరాత్రి దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి సుమారు రూ.1.90 కోట్ల విలువైన సరుకు కాలిపోయిందని యజమాని ప్రొద్దుటూరి నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు అందించారు. కాగా, ఏఓ సతీశ్ అందజేసిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.
విద్యుదాఘాతంతో
గేదె మృతి
అశ్వారావుపేటరూరల్: విద్యుదాఘాతంతో ఓ పాడి గేదె మృతి చెందిన ఘటన శనివారం అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని మెరుపుకాలనీకి చెందిన కోరుకొండ రాజమ్మ తన మూడు పాడి గేదెలను మేత కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఓ హోటల్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభం (ఐరన్) వద్దకు వెళ్లగా షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ రూ.90 వేలు అని రాజమ్మ వాపోయింది.

అశోక్‌నగర్‌లో నివాసాల కూల్చివేత

అశోక్‌నగర్‌లో నివాసాల కూల్చివేత

అశోక్‌నగర్‌లో నివాసాల కూల్చివేత