ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ లభించింది. కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ పంతంగి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆయన ‘డాక్టర్ సీతారాం సాహిత్యం – ఒక అధ్యయనం’ అంశంపై పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించగా కేయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లును కళాశాల ప్రిన్సిపాల్ జకీరుల్లా , అధ్యాపకులు, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు తదితరులు సోమవారం అభినందించారు.