జూలూరుపాడు: గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయమని వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్‌నాయక్ అన్నారు. ఆదివారం రాత్రి జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పూనెం కృష్ణకుమారి, పూనెం నాగేంద్రమ్మ, బండారు నాగేశ్వరరావు, బండారు చిన్న నరసింహారావు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పేదోడి సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అనంతారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారని, 85 ఇళ్లను రూ.4.25 కోట్లతో నిర్మిస్తారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకాలను కొనసాగిస్తోందని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ రైతు సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటిస్తే.. ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించారని వెల్లడించారు. కార్యక్రమంలో లేళ్ల వెంకటరెడ్డి, మాళోత్ మంగీలాల్‌నాయక్, అల్లాడి నరసింహారావు, శంకర్, కరుణాకర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బాదావత్ రవి, డేవిడ్, ఆదినారాయణ, దొండపాటి శ్రీనివాసరావు, బానోత్ లాలునాయక్, వేల్పుల నరసింహారావు, కంచర్ల హరీశ్, ధరావత్ రాంబాబు, కొర్సా రమేశ్, ఉసికల వెంకటేశ్వర్లు, మల్కం వీరభద్రం, లబ్ధిదారులు పాల్గొన్నారు.
వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్