రండి.. రండి..
● ఈ–బయ్యారంలో మొదలైన జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీ ● 33రాష్ట్రాల నుంచి హాజరైన జట్లు ● ఇళ్ల ముందు ముగ్గులతో గ్రామస్తుల స్వాగతం
కార్పొరేషన్ ఏర్పాటుపై
కౌంటర్ దాఖలు చేయండి
పాల్వంచ: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పా టు అసంబద్ధంగా ఉందంటూ కొందరు కోర్టులో కేసులు వేసినా ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడంపై హైకోర్టు స్పందించింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలిలా.. కొత్తగూడెం కార్పొరేషన్‌లో షెడ్యూల్డ్ ఏరియాలోని పాల్వంచతో పాటు సుజాతనగర్ మండంలోని ఏడు గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ సరికాదని, తక్షణం ఎన్నికలు నిలిపివేయాలని, కార్పొరేషన్‌ను రద్దు చేయాలని పాల్వంచకు చెందిన పోట్రు ప్రవీణ్‌కుమార్, అజ్మీర నరేష్ నాయక్, భట్టు కృష్ణ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు బుధవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాదులు, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల మధ్య వాదనలు జరిగగా 19వ తేదీకి వాయిదా పడింది. అప్పటిలోగా ప్రభుత్వ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీలైన మందమర్రి, మణుగూరు, కొత్తగూడెం కార్పొరేషన్‌కు చెందిన ఇతర పెండింగ్ కేసులు సైతం ఏక కాలంలో బెంచ్‌పైకి రాగా వాటికి సైతం 27వ తేదీలోగా కౌంటర్ దాఖ లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో మున్సిపాలిటీగా చేసిన భద్రాచలాన్ని తిరిగిగ్రామపంచాయతీగా మార్చిన అంశాన్ని వారు ప్రస్తావించినట్లు సమాచారం.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


