
రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలం
బాపట్లటౌన్: రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కారు ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి.రాంబాబు విమర్శించారు. శనివారం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కారు విఫలమైందన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం 20 మిలియన్ టన్నుల పొగాకునే రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఒక్కొక్క రైతు నుంచి 20 కింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని తీర్మానించడంతో మిగతా పొగాకు ఎవరు కొంటారు ఎప్పటికీ కొంటారనే రైతులు లబోదిబోమంటున్నారన్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 మంది పొగాకు రైతులు మృతి చెందారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు మరుప్రోలు కొండలురెడ్డి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు జోగి రాజా, బీసీ సెల్ నాయకులు శాయిల మురళి, తన్నీరు అంకమ్మరావు, పిల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని వైనం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ
పాలెపోగు రాంబాబు