
బీజేపీ ప్రభుత్వం ఏ సమస్య పరిష్కరించలేదు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
చిలకలూరిపేట: కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో శనివారం సీపీఐ ఏరియా మహాసభ నిర్వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ రైతులు ఆప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికారం లేనప్పుడు ఒక విధంగా అధికారం వచ్చిన తర్వాత మరోవిధంగా ఉంటారని విమర్శించారు. ఇచ్చిన హామీల మేరకు పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూ డు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివా స స్థలం ఇవ్వాలన్నారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యు డు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఆనా డు లోకేష్ స్మార్ట్ మీటర్లు బద్ధలు కొట్టమని చెప్పా రని ఇప్పుడు అందుకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీవరప్రసాద్ మాట్లాడుతూ సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభలు ఈనెల 7, 8 తేదీలలో వినుకొండలో నిర్వహిస్తున్నామని 7వ తేదీ మధ్యాహ్నం వేలాదిమంది ప్రజలతో భారీ ప్రదర్శ న, శివయ్య స్థూపం వద్ద బహిరంగసభ జరుగుతుందని, సభలను విజయవంతం చేయాలని కోరారు.
నూతన కార్యవర్గ ఎంపిక...
సీపీఐ ఏరియా కార్యదర్శిగా తాళ్లూరి బాబురావు, సహాయ కార్యదర్శిగా బొంతా ధనరాజ్, పట్టణ కార్యదర్శిగా చెరుకుపల్లి నిర్మలతో పాటు 11 మంది ఏరియా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.