ఆసరాతో పోషణకర్తలుగా మహిళలు

- - Sakshi

బాపట్ల: మహిళలను పోషణకర్తలుగా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని ఏపీ లెజిస్లేటివ్‌ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు ఎదగడానికి అన్ని అవకాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పిస్తున్నారన్నారు. అసరా మూడో విడత పంపిణీ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి 32 పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. ఆర్థిక, రాజకీయ రంగంలోను మహిళలకు సమాన హక్కులు, హోదా కల్పిస్తున్నారని వివరించారు.

జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ మీ పిల్లల ఉన్నత భవిష్యత్‌కు చక్కని బాటలు వేయడానికే ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. 30,604 పొదుపు సంఘాల్లో మూడు లక్షల మంది మహిళలకు రూ.263.61 కోట్లు నిధులు విడుదల అయ్యాయన్నారు. కుల, మత, రాజకీయ వివక్షత లేని పాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో అందిస్తున్నారని బాపట్ల శాసనసభ్యులు కోన రఘు పతి అన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత నగదు పంపిణీ మహిళల జీవితాలను మార్చేస్తుందన్నారు. అందులో భాగంగా బాపట్ల నియోజక వర్గంలోని పొదుపు సంఘాల అప్పు లు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్ల నిధులను ఇప్పటి వరకు విడుదల చేసిందన్నారు. దీంతో పొదుపు సంఘాలన్నీ ఇప్పుడు చక్కగా నడుస్తున్నాయన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విశేషంగా కృషి చేస్తున్నారని అభివర్ణించారు. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు పండుగ వాతావరణంలో మహిళ లకు నగదు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ బి.అర్జునరావు, ఎల్‌డిఎంకృష్ణ నాయక్‌, డీపీఎం లక్ష్మణాచారి పాల్గొన్నారు.

చీఫ్‌ విప్‌ డాక్టర్‌ ఉమ్మారెడ్డి

ఘనంగా మూడోవిడత జమ

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top