
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.ఏకాదశి ప.3.10 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం ఉత్తర సా.4.20 వరకు, తదుపరి హస్త, వర్జ్యం రా.12.45 నుండి 2.21 వరకు, దుర్ముహూర్తం ఉ.9.47 నుండి 10.38 వరకు తదుపరి 2.55 నుండి 3.44 వరకు అమృతఘడియలు... ఉ.8.59 నుండి 10.34 వరకు.
సూర్యోదయం : 5.33
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం...పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
వృషభం....ఆదాయానికి మించి ఖర్చులు. బాధ్యతలు అథికమవుతాయి. సోదరులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం....ఆసక్తికర సమాచారం వింటారు. బం««ధువులతో మనస్పర్థలు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కర్కాటకం...విచిత్ర సంఘటనలు. ఆప్తులు, శ్రేయోభిలాషులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
సింహం...బంధువుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.
కన్య....పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల...పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.
వృశ్చికం....శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.
ధనుస్సు....శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం....సోదరులతో విభేదిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. సన్నిహితుల సాయం అభ్యర్థిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
కుంభం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. వస్తులాభాలు. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మీనం....కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.