Today's Horoscope:ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి

Today Horoscope 11-07-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.ద్వాదశి ఉ.7.51 వరకు, తదుపరి త్రయోదశి తె.5.31 వరకు (తెల్లవారితే మంగళవారం), నక్షత్రం జ్యేష్ఠ రా.3.45 వరకు, తదుపరి మూల, వర్జ్యం ఉ.10.26 నుండి 11.55 వరకు దుర్ముహూర్తం ప.12.32 నుండి 1.22 వరకు, తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు, అమృతఘడియలు... రా.7.27 నుండి 9.02 వరకు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుండి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. కొత్త బాధ్యతలతో సతమతమవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: ఆసక్తికర సమాచారం. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల: కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. సన్నిహితులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మీనం: సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమవుతాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top