
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.దశమి రా.3.09 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: మూల సా.6.26 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: సా.4.56 నుండి 6.26 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.55 వరకు, తదుపరి ప.12.22 నుండి 1.11 వరకు అమృతఘడియలు: ప.12.25 నుండి 1.55 వరకు.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.09
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది. రుణయత్నాలు. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృషభం: కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.
మిథునం: ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో కలహాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉండవచ్చు.
కన్య: ఇంతకాలం శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. చర్చలు సఫలం. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల: కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుండి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూ లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.
ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.
మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.
మీనం: కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆప్తుల నుండి పిలుపు రావచ్చు. వాహనాలు కొంటారు. ఆస్తులు సమకూరతాయి. సోదరుల నుండి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.