
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.ద్వాదశి రా.1.46 వరకు, తదుపరి త్రయోదశి,నక్షత్రం: ఉత్తరాషాఢ రా.10.35 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.5.56 నుండి 7.35 వరకు, తిరిగి రా.2.40 నుండి 4.21 వరకు,దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.40 వరకు, అమృత ఘడియలు: ప.3.54 నుండి 5.34 వరకు.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... ఉద్యోగయత్నాలు సానుకూలం. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఆహ్వానాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం... ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం.... ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కర్కాటకం..... కొత్త పనులు ప్రారంభం. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
సింహం... పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కన్య... కుటుంబంలో చికాకులు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
తుల... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం.
వృశ్చికం.. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం... కొత్త విషయాలు తెలుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కుంభం... కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.