అనుమానాస్పద వ్యక్తులు పోలీసులకు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద వ్యక్తులు పోలీసులకు అప్పగింత

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

లక్కిరెడ్డిపల్లె: మండల పరిధిలోని దిన్నెపాడు గ్రామంలో గత రెండు రోజులుగా కార్లు, ద్విచక్ర వాహనాలపై కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అనుమానాస్పదంగా సంచరిస్తున్న వాహనాలను గ్రామస్తులు అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. అయితే కార్లలో ఉన్న వ్యక్తులు వేగంగా తప్పించుకుపోగా, ద్విచక్ర వాహనాలపై ఉన్న ముగ్గురిని గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వారిని గ్రామస్తులు నిలదీసి, వివరాలు ఆరా తీసిన అనంతరం లక్కిరెడ్డిపల్లి పోలీసులకు అప్పగించారు. వీరు రాయచోటి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులుగా నిర్ధారణ అయింది. దిన్నెపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ యువనాయకుడు గజేంద్రరెడ్డి లక్కిరెడ్డిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో సదరు ముగ్గురు అనుమానితులపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, హిందూపురం పార్లమెంటు పరిశీలకులు ఆర్‌. రమేష్‌కుమార్‌ రెడ్డిలు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలతో మాట్లాడి, ఆ అనుమానిత వ్యక్తులు ఎవరు, ఎందుకు తిరుగుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, రామాపురం మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, రామాపురం మాజీ సర్పంచ్‌ భూషణ్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు సూరం వెంకటసుబ్బారెడ్డి, చెన్నారెడ్డిలతో పాటు లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement