పెద్దతిప్పసముద్రం: మండలంలోని బూర్లపల్లిలో సోమవారం నవ్యరెడ్డి (22) అనే నాలుగు నెలల గర్బిణీ అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాలు.. మండలంలోని పోతుపేటకు చెందిన గంగిరెడ్డి కుమార్తె నవ్యరెడ్డికి ఇదే మండలంలోని బూర్లపల్లికి చెందిన అరవిందరెడ్డితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల గర్బిణీ అయిన నవ్యరెడ్డి ఇంట్లోనే మంచంపై పడుకుని హఠాత్తుగా మృతి చెందినట్లు భర్త కుటుంబీకులు పేర్కొంటున్నారు. బీపీ తక్కువ అయి ఉండవచ్చని తెలిపారు. అయితే మృతి చెందిన యువతి గొంతు భాగంలో గాట్లు ఉన్నాయని,ఆమె మృతిపై అనుమానాలు ఉన్నా యని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చే శా రు.ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
37 మందిపై బైండోవర్ కేసులు
గాలివీడు : మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి 37 మందిపై బైండవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు మిగతావారుకూడా స్టేషన్‌లో హాజరు కావాలన్నారు. ఆయా వ్యక్తులు ఆధార్ కార్డు జిరాక్స్‌తో రావాలని ఆయన సూచించారు.
లేడీడాన్ వాణిపై కేసు
మదనపల్లె టౌన్: హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ పేరుతో సమస్యలు పరిష్కరిస్తానని బాధితుల వద్ద రూ. లక్షల్లో డబ్బు తీసుకుంటూ దశాబ్దం కాలంగా మోసాలు చేస్తోన్న అన్నమయ్య జిల్లాకు చెందిన లేడి డాన్ అంగళ్ళు వాణి పై పోలీసులు కేసు నమోదుచేశారు. కురబలకోట మండలం, అంగళ్ళుకు చెందిన వాణి అమాయక ప్రజలకు తాను హ్యూమన్ రేట్స్ స్టేట్ ప్రెసిడెంట్ మహిళా వింగ్‌నని నమ్మించి, ప్రభుత్వ అధికారిక రాజముద్ర మూడు తలలున్న సింహం గుర్తును విజిటింగ్ కార్డుపై వేసుకుని మోసాలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఆదివారం అర్థ రాత్రి ముదివేడు పోలీస్ స్టేషన్‌లో మరో చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు. మదనపల్లె బసినికొండకు చెందిన దివ్యాంగురాలు జ్యోతి దగ్గర రూ. 8లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఆమెను చంపుతానని బెదిరిస్తోందని బాధితురాలి ఫిర్యాదు పై వాణిపై కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు.


