హార్సిలీహిల్స్‌ ఘాట్‌రోడ్డు పనులు మొదలు | - | Sakshi
Sakshi News home page

హార్సిలీహిల్స్‌ ఘాట్‌రోడ్డు పనులు మొదలు

Aug 4 2026 12:59 AM | Updated on Aug 4 2026 12:59 AM

సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ ఘాట్‌రోడ్డుకు తారురోడ్డు పనులు మొదలయ్యాయి. ఘాట్‌రోడ్డు ప్రమాదకంగా మారడం, రోడ్డంతా దెబ్బతిని పర్యాటకులు ప్రమాదాలకు గురవుతుండటం, రహదారి పనులు ప్రారంభం కాకపోవడంపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన రహదారి భవనాలశాఖ అధికారులు కాంట్రాక్టర్‌తో పనులు చేయించేందుకు కృషి చేశారు. దాంతో రూ.4.5 కోట్ల వ్యయంతో తారురోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్‌ తెలిపారు. సోమవారం కడప నగరంలోని హోచిమిన్‌ భవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 11 మంది ఆఫీస్‌ బేరర్లు, 60 మంది సమితి సభ్యులతో కలిపి మొత్తం 71 మందితో ఈ రాష్ట్ర సమితి ఏర్పాటయింది. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటి వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శిగా ఎల్‌.శాంతి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రమీజాబి (కర్నూలు), డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీగా చాముండేశ్వరి (తిరుపతి), కోశాధికారిగా యు.మరియమ్మ (కడప) ఎన్నికయ్యారు.

పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సత్వరమే పరిష్కరించండి: ఎస్పీ

మదనపల్లె టౌన్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం మదనపల్లె జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి 62 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 62 ఫిర్యాదులు రాగా అధికంగా భూవివాదాలు 19, ఆర్థిక లావాదేవీలు 7, కుటుంబ కలహాలు 12, చీటింగ్‌ 4, న్యూసెన్‌న్స్‌ 3, ఇతర సమస్యలు 17 ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement