సాక్షి, మదనపల్లె : ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న ఏపీటెట్ ఆన్‌లైన్ పరీక్షలకు ఆటంకాలు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌న్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మదనపల్లెలో రెండు, రాయచోటిలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,470 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో తగిన సంఖ్యలో కంప్యూటర్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం పవర్ బ్యాకప్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థుల రాకపోకలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, వైద్య బృందాలు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నరసయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
యువత భాగస్వామ్యం కావాలి
జిల్లాలో అర్హులైన యువతను ’మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేయించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇన్‌చార్జ్ జిల్లా కలెక్టర్ శివ నారాయణ్ శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మై భారత్ కేంద్రం–యువ అంశంపై జిల్లా సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా యువతకు ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సేవలు, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసం మరియు జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే గొప్ప అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యా, యువజన, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ వెంకటేష్, కేఆర్‌సీసీ ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా యువజన అధికారి దీపక్ జేమ్స్, మరియు సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ


