రైల్వేకోడూరు స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ స్థానిక ప్రజల నుంచి వచ్చిన వినతులపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి తక్షణమే స్పందించారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగి రైల్వే ఉన్నతాధికారులకు వరుస లేఖలు రాయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించారు. ఎంపీ చొరవకు గుంతకల్ రైల్వే డీఆర్‌ఎం సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపారు. ఎంపీ ప్రతిపాదనలన్నింటికీ రైల్వే బోర్డు ఆమోదం తెలపడంతో పాటు, రూ.1.50 కోట్ల నిధులు మంజూరయ్యేలా మిథున్‌రెడ్డి చేసిన కృషి క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిచ్చింది.


