రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లి చింతలకుంటవాళ్లపల్లి మార్గమధ్యలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పకీరమ్మ (68) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్‌ఐ గోల్కొండ శోభ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. కోనంపేట పంచాయతీలోని కాలాడివాళ్లపల్లికి చెందిన పకీరమ్మ ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్లి వచ్చింది. మధ్యాహ్నం బ్యాంకులో అగ్రికల్చర్‌ సంబంధించిన పని పూర్తి చేసుకొని, కూరగాయలు తీసుకొని కాలాడివాళ్లపల్లెకు కాలినడకు వెళ్తుండగా కోనంపేట నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే రెండు కాళ్లు చేతులు విరిగిపోయి మృత్యువాత పడింది. ఈ మేరకు కార్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement