పెన్నాలోకి దూకి ఆత్మహత్యాయత్నం
సిద్దవటం : పెన్నా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. మండల కేంద్రమైన సిద్దవటం హైలెవెల్ వంతెన పైనుంచి ఆదివారం సాయంత్రం కడప నగరంలోని ఎర్రముక్కపల్లి గ్రామానికి చెందిన శిరీష అనే మహిళ పెన్నానదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో బ్రాహ్మణవీధి సమీపంలో సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మాట్లాడుతూ వివాహమై 15 సంవత్సరాలు అయిందని తనకు బిడ్డలు పుట్టలేదని ప్రాణం మీద విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని తెలిపారు. సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఆ మహిళను విచారణ చేసి వారి బంధువులకు అప్పగించారు.


