మదనపల్లె ఇప్పుడు జిల్లా కేంద్రమైంది.ఈ స్థాయికి తగ్గట్టు
విశ్వవిద్య కావాలి
బైపాస్‌రోడ్డు అత్యవసరం
మదనపల్లె: నిన్నటిదాకా మదనపల్లె విద్య,వైద్యంపై కక్షకట్టి నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇక అభివృద్ధి వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అన్నమయ్యజిల్లాకు మదనపల్లె కేంద్రం కాడవంతో రాజకీయాలు ఆపి..ప్రగతికి బాటలు వేయాలని, వైఎస్సార్‌సీపీ హయాంలో మంజూరయ్యాయని భేషజాలకు వెళ్లకుండా చిత్తశుద్ధి చూపాలని ప్రజలు కోరుతున్నారు.అలా చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ పాలనలో రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి మంజూరు చేయించిన అభివృద్ధి పనులు మదనపల్లెకు మకుటంగా నిలుస్తాయంటున్నారు. పట్టణ జనాభా పెరగడంతోపాటే, రాకపొకలు సాగించే ప్రజలు నిత్యం వేలల్లో ఉండటంతో మదనపల్లెను అభివృద్ధిలో ముందువరసలో నిలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చెబుతున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి కృషితో మంజూరైన వైద్యకళాశాల, కేంద్రీయ విద్యాలయం, అనిబిసెంట్ విశ్వవిద్యాలయం ముందుకు సాగాల్సి ఉంది. మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా నివారించే బైపాస్‌రోడ్డు కోసం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు విన్నవిస్తున్నారు.
వైద్య కళాశాల ప్రభుత్వమే నడపాలి
శానిటోరియం వద్ద మదనపల్లెకు 95 ఎకరాల్లో వైద్యకళాశాలను మంజూరు చేసి రూ.475 కోట్లతో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాకతో జరిగిన రూ.80 కోట్ల పనులు ఆపేసి పీపీపీ కింద ప్రైవేట్‌కు ఇచ్చేందుకు టెండర్లు నిర్వహిస్తే ఒక్కటి దాఖలు కాలేదు. సంస్థలు టెండర్లు వేయకపోవడం ప్రజల నిర్ణయాన్ని అంగీకరించినట్టే. ఇప్పటికై నా ప్రభుత్వం వైద్యకళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. అసంపూర్తి పనులను పూర్తి చేయించి పేద విద్యార్థులకు సీట్లు దక్కి వైద్య విద్య అభ్యసించేలా, పేదలకు కార్పోరేట్ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మదనపల్లె ప్రజలు కోరుకుంటున్నారు.
కేంద్రీయ విద్య అందించండి
మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం మంజూరుకు ఎంపీ మిథున్‌రెడ్డి కృషి చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరమే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. దీనిపై తాజాగా కేంద్రీయ విద్యాలయ అధికారులు మదనపల్లెలో తమకు కేటాయించిన భూమిని అప్పగిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, ప్రభుత్వానికి లేఖలు రాసినా ఇంకా చలనం లేదు. మదనపల్లె పేద విద్యార్థులకు కేంద్రీయ విద్య వద్దని ప్రభుత్వం అనుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటు పేరుతో చవగ్గా భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం కోసం సిద్దంచేసిన 6.09 ఎకరాల భూమిని ఎందుకు అప్పగించడం లేదో ఇప్పటికి మదనపల్లె ప్రజలకు అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పటికై నా ఈ విద్యాలయం ఎంత అవసరమో గుర్తించి చర్యలు తీసుకుంటే విద్యాపరంగా ఇది మకుటంగా నిలుస్తుంది.
ప్రస్తుతానికి విశ్వవిద్యాలయంలేని జిల్లా అన్నమయ్య. జిల్లా కేంద్రమైన మదనపల్లెలో అనిబిసెంట్ విశ్వవిద్యాలయాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి మంజూరు చేయించారు. చంద్రబాబు ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. మదనపల్లెలో విద్యాపరంగా ప్రైవేట్ కళాశాలలదే పైచేయి. ప్రభుత్వపరంగా విద్యార్థులకు కళాశాలల కొరత ఉంది. అలాగే విశ్వవిద్యాలయం ఏర్పాటు అవసరం ఉంది.అనిబిసెంట్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, భవనాలు బీటీ కళాశాలలో సిద్ధంగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పుతుంది. విశ్వవిద్యాలయం చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే కూడా పలువేదికలపైన హామీలు ఇచ్చారు. కాని కదలిక ఏమాత్రం లేదు.
రోజురోజుకు విస్తరిస్తున్న మదనపల్లె పట్టణానికి బైపాస్‌రోడ్డు అత్యవసరమైంది. ఈ విషయమై ఎంపీ మిథున్‌రెడ్డి చొరవ తీసుకున్నారు. అన్నమయ్య సర్కిల్ నుంచి బెంగళూరురోడ్డుకు, అక్కడినుంచి పలమనేరు హైవేరోడ్డు వరకు బైపాస్‌రోడ్డు నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరికి మిథున్‌రెడ్డి విన్నవించి వినతి అందించారు. కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉండటంతో ప్రభుత్వం స్పందించి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చూపుతున్న చొరవను స్థానికులు కొనియాడుతున్నారు. జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేయడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, కేంద్రీయ విద్యాలయంపై తక్షణమే చర్య లు ప్రారంభిస్తే ప్రయోజకరమని, మదనపల్లెను ఇవి అగ్రస్థానంలో నిలుపుతాయని అంటున్నారు.
మదనపల్లె వైద్య కళాశాలనుప్రభుత్వమే నడపాలి
కేంద్రీయ విద్యాలయానికిభూమి అప్పగించాలి
విశ్వవిద్యాలయానికి నాంది పలకాలి
ఇవన్నీ వైఎస్సార్‌సీపీప్రభుత్వంలోనే వచ్చాయి
కార్యరూపం దాల్చితేనేజిల్లా కేంద్రం అభివృద్ధి
మదనపల్లె ఇప్పుడు జిల్లా కేంద్రమైంది.ఈ స్థాయికి తగ్గట్టు
మదనపల్లె ఇప్పుడు జిల్లా కేంద్రమైంది.ఈ స్థాయికి తగ్గట్టు


