ప్రక్రియ ప్రారంభించాలి
బీటీ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి. బీటీసీ ట్రస్టు ఆస్తులను ప్రభుత్వానికి బదలాయించేందుకు సిద్ధంగా ఉంది. యూజీసీ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపాలి. గత ప్రభుత్వంలో జీవో ఇచ్చింది. మిగతా చర్యలు పూర్తిచేయాలి.
–జి.రామదాసు, మాజీ చైర్మన్, బిటి కళాశాల
బైపాస్ రోడ్డు కావాలి
మదనపల్లెలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు అత్యవసరం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించి నిధులు తెప్పించాలి. వెంటనే బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టకుంటే ఇబ్బందులు తప్పవు. జిల్లా కేంద్రం కావడంతో రద్దీ ఎక్కువగా పెరిగింది. –బి.రవికుమార్, మదనపల్లె
పీపీపీ వద్దు
మదనపల్లె వైద్య కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలి. గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలి. పీపీపీ వద్దు. ఇప్పటికే రూ.80కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించారు. తక్షణమే ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాల ప్రారంభించి వైద్యులు, సిబ్బందిని నియమించాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. –అనిల్ కుమార్ రెడ్డి,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్‌ఆర్సీపీ వైద్య విభాగం
నాణ్యమైన విద్య
మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయ ప్రారంభానికి చర్యలు చేపట్టాలి. అప్పుడే పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతమైన విద్య అందుతుంది. ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతుల ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. –బి.ఈశ్వరయ్య,
ఏపీఎస్‌ఈఆర్సీ మాజీ సభ్యులు
ప్రక్రియ ప్రారంభించాలి
ప్రక్రియ ప్రారంభించాలి
ప్రక్రియ ప్రారంభించాలి


