వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేతుడికి అమావాస్య పూజల్లో భాగంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాడవీధులలో ప్రాంగణంలో ఊరేగించారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
బి.కొత్తకోట: పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఆదివారం సందర్శకుల సందడి నెలకొంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో సందర్శకులతో కొండ కిటకిటలాడింది. కర్ణాటక, తమిళనాడుకు చెందిన పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అతిథిగృహాలకు డిమాండ్ పెరిగింది.సందర్శకులు జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, ప్రకృతి అధ్యయన కేంద్రాలను తిలకిస్తూ సేద తీరారు. అత్యధిక గాలితో ప్రకృతికి పెట్టింది పేరైన గాలిబండపై సందర్శకులు చల్లటిగాలి, ఆహ్లాదరకరమైన వాతావరణం ఆస్వాదించారు.
కడప అగ్రికల్చర్: కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 2620 మెట్రిక్ టన్నుల ఎరువులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రా నాయక్ తెలిపారు. ఇందులో 2320 మెట్రిక్ టన్నుల యూరియా మరో 300 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పోటాష్‌లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇందులో వైఎస్సార్‌జిల్లాకు సంబంధించి 1660 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారు. ఇందులో 1060 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 600 మెట్రిక్ టన్నులను మార్కెఫెడ్‌కు కేటాయించారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 200 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇందులో 100 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు మరో 100 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌కు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 460 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇందులో 460 టన్నులను మార్క్‌ఫెడ్‌కు కేటాయించారు.
వైభవం..పల్లకీ ఉత్సవం
వైభవం..పల్లకీ ఉత్సవం


