వ్యక్తిని కాపాడిన యువకుడు
బి.కొత్తకోట : మండలంలోని డేగానిపల్లెకు చెందిన దివ్యాంగుడిని ఓ యువకుడు కాపాడిన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. దివ్యాంగుడైన ఆంజనేయులు మూడు చక్రాల బండిలో వెళ్తూ ఇందిరమ్మ కాలనీకి సమీపంలో వెళ్తున్న హంద్రీనీవా కాలువలోకి జారిపడ్డాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానిక యువకులు గుర్తించి కాలువలోకి దిగి కాపాడారు.
వాహనం ఢీకొని తీవ్ర గాయాలు
మదనపల్లె : మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు. యనమలవారిపల్లికి చెందిన జి.మోహన్ (47) బైకుపై ఆరోగ్యవరం వద్ద వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. మోహన్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.
జూదరుల అరెస్ట్
పుంగనూరు : సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని సుగాలిమిట్ట వద్ద పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.33 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కేవీ రమణ తెలిపారు. ఆదివారం ముందస్తు సమాచారం మేరకు పోలీసులు వలపన్ని, జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
వ్యక్తిని కాపాడిన యువకుడు


