ప్రాణం మీదికి తెచ్చిన గాలిపటం సరదా
● రెండస్తుల మిద్దైపె నుంచి పడి చిన్నారికి తీవ్ర గాయాలు
● 108 సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణాపాయం
కలికిరి : గాలిపటం సరదా ఓ చిన్నారిని ప్రాణాపాయంలోకి నెట్టిన దుర్ఘటన కలికిరి మండలంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుట్టపాళెం గ్రామం గుట్టపాళెం కస్పాలో మీర్‌జాఫర్, సలీమా కుమారుడు ఎస్‌కే జుబేల్(12).. సంక్రాంతి సందర్భంగా ఆదివారం గాలిపటం ఎగురవేయడానికని రెండస్తుల మిద్దైపెకెక్కాడు. గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు మిద్దైపెనుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రలు 108 వాహనికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఈఎంటీ చంద్రబాబు, పైలెట్ సీటీఎం రమణ సకాలంలో స్పందించి చిన్నారి జుబేల్‌కు ప్రథమ చికిత్స అందిస్తూ 1.10 గంటల్లోనే తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సకాలంలో తీసుకురావడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం.


