మేకలవారి ఇంట.. ఉద్యోగాల పంట
పీలేరు : రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు పంచాయతీ మేకలవారిపల్లె, కొండారెడ్డిగారిపల్లెలో మేకలవారి కుటుంబంలో సుమారు 50 మంది వివిధ ఉద్యోగాలు కలిగి ఉన్నారు. శనివారం స్థానిక ఎస్వీఎస్‌ఎస్ కల్యాణ మండపంలో మేకల వారి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమా వేశం నిర్వహించారు. మేకలవారి కుటుంబ సభ్యుల్లో ట్రాన్స్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇంజినీర్లుగా, డాక్టర్‌లుగా, టీచర్లుగా, పోలీసులుగా ఉద్యోగం చేస్తున్నారు. కష్టసుఖాల్లో అందరూ పాలుపంచుకునే విధంగా ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


