వాట్సాప్ స్టేటస్‌లో పునుగు పిల్లి
మదనపల్లె: శ్రీవారి సేవలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాన్ని ఇచ్చే పునుగు పిల్లిని బోనులో ఉంచి ఆ వీడియోను స్టేటస్ గా పెట్టిన విషయం శనివారం వెలుగుచూసింది. ఇది అటవీ శాఖలో కలకలం రేపగా ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన వ్యక్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రాథమికంగా విచారణ చేశారు. ఆ నెంబర్ కురబలకోట మండలం అంగడిల్లుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇలా పెట్టిన వ్యక్తి ఎవరు, పునుగుపల్లి ఎక్కడి నుంచి వచ్చింది. దాన్ని బోనులో ఎందుకు బంధించారు అన్న వివరాలు తెలియలేదు. అతి తక్కువ సంఖ్యలో ఉన్న పునుగుపిల్లికి శ్రీవారి సేవలో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఈ పునుగుపిల్లి ఎక్కడ ఉంది అన్నది కూడా నిర్ధారణ కాలేదు. కురబలకోట అటవీశాఖ సిబ్బంది ఆచూకీ కోసం ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా అంగడిల్లుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని ఆచూకీ కోసం ఆరా తీయగా గ్రామంలో లేడని తెలుసుకున్నారు. దీంతో ఆదివారం పూర్తిస్థాయిలో విచారించాలని ప్రయత్నిస్తున్నారు. ఏడాది క్రితం పునుగుపల్లి బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పై వెలుగు చూసింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పునుగుపిల్లి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తేలాల్సి ఉంది.
బోనులో బంధించిన వీడియో
నంబర్ ఆధారంగా
అంగడిల్లు వ్యక్తిగా గుర్తింపు


