తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ
సీపీఎం జిల్లా కార్యదర్శి
జి చంద్రశేఖర్ డిమాండ్
కలసపాడు : కలసపాడు మండలంలో తెలుగు తమ్ముళ్లు ఢీ అంటే ఢీ అని గొడవకు దిగారు. ఈ విషయం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగింది. ఈ సంఘటన గురువారం కలసపాడులో చోటు చేసుకుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజు కలసపాడులోని తెలుగుగంగ కాలువ పక్కన ఉన్న అంకాలమ్మ తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ కమిటీ నిర్వాహకులు జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డిని కలిసి తిరునాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి కొంత మొత్తం తిరునాల ఖర్చులకు అందజేశారు. మొదటిసారిగా సూర్యనారాయణరెడ్డి కలసపాడుకు వస్తుండటంతో ఆయన వర్గీయులు స్వాగత ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న బద్వేలు టీడీపీ ఇన్‌చార్జి రితీష్‌రెడ్డి వర్గీయులు సూర్యనారాయణరెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరునాలకు హాజరైన సూర్యనారాయణరెడ్డి ఆలయంలో పూజలు చేసి బండలాగుడు పోటీలు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. వెంటనే రితీష్‌రెడ్డి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ళ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హేమసుందర్‌రావు, స్థానిక ఎస్‌ఐ సుభాన్, సిబ్బంది తిరుణాల ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసు బందోబస్తు మధ్య డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి బండలాగుడు పోటీలను ప్రారంభించారు.


