
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ నిర్వహించి చంద్రబాబు తప్పిదాలను శనివారం ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కొరముట్ల మాట్లాడుతూ పేదలకు వైద్యం అందాలనే ఉన్నత లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని దోపిడీదారులకు తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. పేద ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని, అప్పులు తెచ్చి కార్పొరేట్లకు దోచిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. ముందుచూపుతో పేదలకోసం జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాలను మాత్రమే చేపడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షలను ప్రేరేపిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, అక్రమాలు, దౌర్జన్యాలు, అంటూ కేసులు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని పే ర్కొన్నారు. బాబు మోసపు పాలనను ప్రజలు గుర్తించి చైతన్య వంతులవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాబాబుల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డిధ్వజారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, సీహెచ్.రమేష్, సుబ్బరామరాజు, చంద్రశేఖర్, మందలనాగేంద్ర, శివయ్య, సద్ధయ్య, మహేష్ రెడ్డి, నారాయణమ్మ, రమేష్, కృష్ణారెడ్డి, నందాబాల, ఆనంద్, రాజారెడ్డి, సుకుమార్, పవన్, గౌసియా, సుబ్రహ్మణ్యంరాజు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు