అక్రమార్కులు భారీగా వృక్షాలను కూల్చేసి గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు, మహా రాష్ట్రాలకు అక్రమంగా తలించుకుపోతున్నారు. టీడీపీ నేతల అండ పుష్కలంగా ఉండడంతో ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఓ వైపు ప్రభుత్వం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రచారం చేస్తు | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కులు భారీగా వృక్షాలను కూల్చేసి గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు, మహా రాష్ట్రాలకు అక్రమంగా తలించుకుపోతున్నారు. టీడీపీ నేతల అండ పుష్కలంగా ఉండడంతో ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఓ వైపు ప్రభుత్వం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రచారం చేస్తు

Oct 12 2025 7:55 AM | Updated on Oct 12 2025 7:55 AM

అక్రమ

అక్రమార్కులు భారీగా వృక్షాలను కూల్చేసి గుట్టుచప్పుడు కా

సర్కారు నిర్లక్ష్యం.. కూలుతున్న వృక్షం

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి

తమిళనాడు, మహారాష్ట్రాలకు

తరలిపోతున్న కలప

టీడీపీ నేతల అండతో

నేలకొరుగుతున్న చెట్లు

గుర్రంకొండ : ఎక్కడపడితే అక్కడ యథేచ్చగా చెట్లు నరికివేస్తున్నారు. చెట్ల సంరక్షణ చూసే అటవీ, రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గ్రామాల్లో అన్ని రకాల చెట్లు, వనాలు పురాతనమైనవి. శతాబ్దాల క్రితం నాటిన చెట్లపై వ్యాపారులు దృష్టిసారిస్తున్నారు. పట్టాలున్న పొలాల్లో గాక పోరంబోకు స్ధలాల్లోని మొక్కలను అక్రమంగా నరికివేస్తున్నారు. ఇంటి వస్తువులు తయారుచేసే కలపతోపాటు ఇటుక బట్టీలు కాల్చడంలోనూ వినియోగించుకొంటున్నారు. చివరకు దేవుడి మాన్యం, వంక పోరంబోకు, చెరువుపోరంబోకు స్థలాల్లోని పురాతన చెట్లను వదలడం లేదు. లక్షలాది రుపాయల విలువచేసే చెట్లను నరికి సొమ్ము చేసుకొంటున్నారు.

తరలిపోతున్న వృక్షసంపద

జిల్లాలోని వ్యాపారులే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి చింతచెట్లతోపాటు సంద్ర, కంప ఇతర వృక్ష సంపదను కొల్లగొడుతున్నారు. బయట రాష్ట్రాల నుంచి కూలీలను జిల్లాకు తలరించి రేయింబవళ్లు చెట్లు నరికి బయట రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇందులో వందల ఏళ్లు గల చెట్లు ఉన్నాయి. తోటలు, పొలాల గట్లు, ఊరి మధ్యలో, రచ్చబండల మధ్య ఉన్న చెట్లను నరికి వేయడంతొ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒక్కో చెట్టు నుంచి చవ్చే కలప సుమారు రూ:20 వేల నుంచి రూ: 40వేల వరకు ధర పలుకుతోందని అంచనా. ఇంటి వస్తువుల తయారీకి ఉపయోగపడే చెట్లు లక్షలాది రుపాయలు ధర పలుకుతున్నాయి. స్థానిక వ్యాపారులు ఇతర రాష్ట్రాల వారితో కుమ్మకై ్క ఇష్టానుసారం తరలించేస్తున్నారు.

అక్రమార్కులకు టీడీపీనేతల అండ

బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేస్తున్న అక్రమార్కులకు కొంతమంది టీడీపీ నేతలు అండగా నిలుస్తున్నారు. ఇటీవల చెర్లోపల్లె, కృష్ణాపురం, ప్రస్తుతం గుర్రంకొండ పట్టణ సమీపంలో భారీగా వృక్ష సంపదను నరికి డంపింగ్‌ చేశారు. రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర తరలించడం.. తనిఖీ చేసిన అధికారులకు టీడీపీ నేతలనుంచి ఫోన్లు రావడంతో వెనుదిరిగి వచ్చేసున్నారు. ఇటీవల కృష్టాపురం దగ్గర తమిళనాడు రాష్ట్రానికి చెందిన అక్రమార్కులు భారీగా చెట్లను నరికి లారీల్లో లోడింగ్‌ చేశారు. సమాచారం అందుకొన్న రెవెన్యూ అధికారులు హుటాహుటిన వెళ్లి చర్యలకు ఉపక్రమించగా టీడీపీ నేతల ఫోన్లు రావడంతో చేసేదిలేక వెనుదిరిగి వచ్చేశారు. ఇలా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతల అండతో కొందరు ఇష్టానుసారంగా వృక్షసంపద కొల్లగొడుతున్నారు.

మాకు కాదు.. మీకే సంబంధం

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాది కాదు... మీదంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఒకరిపై ఒకరి నిందలు వేసుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చెట్లను నరికి వేయడానికి ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత నరికివేసిన చెట్లను ఏ ప్రాంతానికై నా తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. చెట్లను కోసేయడానికి ఎలాంటి అఽనుమతులు తీసుకోకుండా లారీలు, ట్రాక్టర్ల ద్వారా వృక్ష సంపద తరలించారు. కొయ్యమిల్లులతోపాటు బయట రాష్ట్రాలకు తీసుకుతున్నా చోద్యం చూస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కలప తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

గుర్రంకొండ సమీపంలో నరికి తరలించేందుకు సిద్ధం చేసిన కలప ఎగువ హరిజనవాడలో కూల్చివేసిన వందేళ్ల చెట్టు

చెట్లను అక్రమంగా నరికివేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా ఎవరైనా వ్యాపారులు చెట్లను నరికివేసి తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. చెట్లు నరికివేతపై ప్రజలు తమకు సమాచారం అందించి సహకరించాలి.

– సదాశివప్పనాయుడు, ఎంఆర్‌ఐ, గుర్రంకొండ

రెవెన్యూ అధికారులు చెట్లను నరికి వేయడానికి అనుమతిచ్చినా.. అటవీ శాఖ అనుమతి లేనిదే బయట ప్రాంతాలకు తరలించరాదు. ప్రతి వాహనం నరికి కలప ఎక్కడికి, ఎందుకు తీసుకు వెళుతున్నారనే సమాచారం ఇవ్వాలి. మా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తాం.

– రామ్మోహన్‌, ఫారెస్ట్‌బీట్‌ ఆఫీసర్‌, గుర్రంకొండ

అక్రమార్కులు భారీగా వృక్షాలను కూల్చేసి గుట్టుచప్పుడు కా1
1/2

అక్రమార్కులు భారీగా వృక్షాలను కూల్చేసి గుట్టుచప్పుడు కా

అక్రమార్కులు భారీగా వృక్షాలను కూల్చేసి గుట్టుచప్పుడు కా2
2/2

అక్రమార్కులు భారీగా వృక్షాలను కూల్చేసి గుట్టుచప్పుడు కా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement