
రాయచోటి అర్బన్ : నకిలీ మద్యం కేసు సీబీఐకి అప్పగించాలని, కూటమి నేతల కల్తీ లిక్కర్ కుటీర పరిశ్రమలపై నిజాలు నిగ్గుతేల్చాలని వెఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యంతో జగన్ ప్రభుత్వం హయాంలో ఏదో జరిగిపోయిందని ఆరోపించిన చంద్రబాబు చివరకు నిరూపణ చేయలేకపోయారన్నారు. ఆధారాలు లేకుండా ఎంపీ మిథున్‌రెడ్డి, సీనియర్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్టమోహన్‌రెడ్డిలను అక్రమంగా నిర్భందించారన్నారు. కూటమి నాయకులు మాత్రం కల్తీ మద్యం తయారు చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ప్రాణాంతకమైన స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు సి మహిళ పసుపుకుంకాలతో ఆటలాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారన్నారు. కల్తీ మద్యం తయారీలో చంద్రబాబు, లోకేష్, ఇతర నాయకుల పాత్రపై సీబీఐచే విచారణ చేయించి నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. 16 నెలల పాలనలో వైఎస్.జగన్ ప్రజలకు చేసిన మేలు, తెచ్చిన అప్పులపై కూడా చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు పూనుకున్న కూటమి సర్కార్‌పై కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని, ప్రైవేటీకరణ ఆపేంత వరకూ పోరాటం ఆపేదిలేదన్నారు.