
నేడు విధుల్లోకి కొత్త ఉపాధ్యాయులు
రాయచోటి: ఉపాధ్యాయ పోటీ పరీక్షల్లో వందల మందిని దాటుకొని బోధనను వృత్తిగా చేపట్టనున్న నూతన ఉపాధ్యాయులు సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో బాధ్యతలను చేపట్టనున్నారు. జిల్లాలో 542 మంది కొత్త టీచర్లు బాధ్యతలను చేపట్టనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. వీరికి వారం రోజులపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు శిక్షణను కూడా పూర్తి చేశామన్నారు. సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో బాధ్యతలు చేపట్టేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు డీఈఓ చెప్పారు. జిల్లాలోని 30 మండలాల్లో చిట్వేలి మండలానికి అత్యధికంగా 55 మంది నియామకం కాగా నిమ్మనపల్లెలో ఒకరు, రాయచోటిలో ఇద్దరు వంతున నియామకమయ్యారు.
మండలాల వారీగా కేటాయించిన
టీచర్ల వివరాలు..
చిట్వేలి 55. ఓబులవారిపల్లి 51, గాలివీడు 43, టి సుండుపల్లి 39, పెద్దతిప్ప సముద్రం 37. పెనగలూరు 34. పెద్దమండెం 27, తంబళ్లపల్లి 25, నందలూరు 21, కోడూరు 20, మదనపల్లి 20, లక్కిరెడ్డిపల్లి 19, పుల్లంపేట 19, వీరబల్లి 19. బి కొత్తకోట 14, రాజంపేట 11, చిన్నమండెం 10, కలకడ 10, ములకల చెరువు 10, కెవిపల్లి 9. సంబేపల్లి 9, రామసముద్రం 8, గుర్రంకొండ 7. పీలేరు 7. కలికిరి 6. కురబలకోట 3, రామాపురం 3, వాయల్పాడు 3. రాయచోటి 2, నిమ్మనపల్లి ఒకరు వంతున 542 మంది సోమవారం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టనున్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టనున్న ఉపాధ్యాయులకు డీఈఓ సుబ్రమణ్యం అభినందనలు తెలిపారు. మంచి బోధనను అందించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.