
నేడు కొత్త వీసీ బాధ్యతల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా బెల్లంకొండ రాజ శేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్., బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి, సైకాలజీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి, డేటా సైన్స్, ఇంజినీరింగ్ బిట్స్ పిలాని నుంచి నాలుగు మాస్టర్స్ డిగ్రీలు పొందారు. 1999లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో విశిష్ట సేవలందించారు. తాజాగా వైవీయూ వీసీగా నియమితులయ్యారు. ఈ మేరకు నూతన వీసీకి స్వాగతం పలుకుతూ వైవీయూ అధికారులు ఏర్పాట్లు చేశారు.