
● సీబీఐ విచారణకు డిమాండ్
సాక్షి రాయచోటి: కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో నకిలీ మద్యం వ్యవహారం రచ్చ రేపుతోంది. ప్రధానంగా జిల్లాలోని ములకల చెరువులో ఇటీవల బయటపడిన నకిలీ మద్యం వ్యవహారం జిల్లాలో కలకలం రేపింది. వివిధ రకాల బ్రాండ్లను స్వయంగా తయారు చేస్తూ మద్యం షాపుల ద్వారా బెల్ట్ షాపులకు పంపించిన వ్యవహారం బట్టబయలు కావడం, ప్రత్యేకంగా మిషనరీ పెట్టి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఎకై ్సజ్ అధికారులకు పట్టుబడటం అందరికీ తెలిసిందే. జిల్లాలో పలు ప్రాంతాలకు బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని సరఫరా చేసిన కొంతమంది టీడీపీ నేతలు అరెస్టు అయినా...కీలక నేతలు ఇంతవరకు అరెస్టు కాలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నకిలీ మద్యం వ్యవహారంపై ఆందోళనలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అఽధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం వ్యవహారంపై సోమవారం ఎక్కడికక్కడ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టడంతోపాటు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.
ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు
అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనా అధికారంలో ఉండడంతో టీడీపీ నేతలు ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులను ఏర్పాటు చేశారు. గుడి, బడుల పక్కన పెట్టకూడదన్న విషయాన్ని విస్మరించి సమీప ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ఎవరూ అడిగే వారు లేరన్న ధైర్యమో...అధికారం ఉందికదా ఎవరు ఏమి చేయరన్న ధీమాతో ఎక్కడపడితే అక్కడ షాపులు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం...అందులో సంబంధీకులకే షాపులు రావడంతో ఎకై ్సజ్ అధికారులు కూడా ఎందుకొచ్చిన తంటా అని ప్రశ్నించడం కూడా మానేశారని పలువురు చర్చించుకుంటున్నారు.
కీలక నేతల అరెస్టులు ఎప్పుడో?
అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో కలకలం రేపిన నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో చోటా మోటా వారిని అరెస్టు చేసినా కీలక నిందితులను ఎప్పుడు అరెస్టు చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జిగా కొనసాగిన జయచంద్రారెడ్డితోపాటు ఆయన బావమరిది, పీఏలను ఇంకా అరెస్టు చేయలేదు. వారి కోసం అన్వేషిస్తున్నట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొంటున్నా జాడ కనిపెట్టలేకపోతున్నారు. కీలక నేత జయచంద్రారెడ్డి విదేశాల్లో ఉండగా, మిగిలిన వారు ఎక్కడున్నారన్నది అంతుచిక్కడం లేదు. కీలక నేతలు అరెస్టుల తర్వాత కస్టడీకి తీసుకుంటే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జిల్లా వాసులు తెలియజేస్తున్నారు.
గుడులు, బడులు పక్కన ఉండకూడదని వినతులు
దోషులను కఠినంగా శిక్షించాలి
వైన్‌షాప్‌ల కేటాయింపులోజరిగిన అక్రమాలు గుర్తించి, అనర్హులను తొలగించాలి
నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన
అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు ప్రాంతంలో వెలుగుచూసిన నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాయడంతోపాటు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుత కూటమి సర్కార్ అధికారంలో ఉండడం, మరోవైపు టీడీపీ కీలక నేతలే నిందితులుగా ఉన్న నేపథ్యంలో ఎకై ్సజ్‌శాఖ ద్వారా న్యాయం జరగదని....సీబీఐ అయితే పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పార్టీ నేతలు కోరుతున్నారు.
నకిలీ మద్యం వ్యవహారంపై జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లోని ఎకై ్స జ్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టడంతోపాటు వినతిపత్రాలను సమర్పించనున్నారు. ప్రధానంగా గుడులు, బడుల పక్కన వైన్‌షాపులు ఉండకూడదని, వైన్‌షాప్‌ల కేటాయింపులో జరిగిన అక్రమాలను గుర్తించాలని, నకిలీ మద్యం వ్యవహారంలో ఎంతటి వారున్నా ఉపేక్షించకుండా అరెస్టుచేయాలని, అలాగే సీబీఐ దర్యాప్తు కోరాలని తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ ఆందోళన బాట పట్టింది. సోమవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదలనున్నాయి.

● సీబీఐ విచారణకు డిమాండ్

● సీబీఐ విచారణకు డిమాండ్