
ప్రజల భద్రతే.. మా ప్రథమ కర్తవ్యం
రాయచోటి : జిల్లా ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సహకారమే నేరాలను అరికట్టేందుకు అసలు బలమని ఎస్పీ తెలిపారు. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, నీటి కుంటలు, బోర్లు వంటి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లనీయ వద్దని హెచ్చరించారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, పేకాట, కోడి పందేలు, గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్లు, నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఎక్కడైనా గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి