
జీఎస్‌టీ తగ్గింపు ప్రతి రైతుకు తెలియాలి
రాజంపేట రూరల్ : వ్యవసాయం చేసే ప్రతి రైతుకు జీఎస్‌టీ తగ్గింపుదల గురించి తెలియజేయాలని వ్యవసాయ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. మండల పరిధిలోని ఊటుకూరులో శుక్రవారం జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్‌టీ సూపర్ సేవింగ్స్‌లో భాగంగా ఏడీఏ కే.శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌లు, వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ సబ్ కలెక్టర్ హెచ్.ఎస్ భావనతో కలిసి నూతన జీఎస్‌టీ ధరతో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌లను ప్రారంభించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ జీఎస్‌టీతో వ్యవసాయ కార్యకలాపాల ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. డ్రిప్, స్ప్రింకర్‌లపై 5 శాతం తగ్గిందన్నారు. రూ.6 లక్షల ట్రాక్టర్‌పై రూ.42 వేలు తగ్గుతుందన్నారు. అదే విధంగా ట్రాక్టర్ విడిభాగాలైన టైర్‌లు, హైడ్రాలిక్ పంపులు వంటి వాటిపై కూడా తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ పీర్‌మున్నీ, ఎంపీడీఓ వరప్రసాద్, జీఎస్‌టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పీ.మధుసూదన్‌రెడ్డి, ఏఓ జీ నాగలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్, హెచ్‌ఓ సునీల్, బీటీఎం సుబ్రమణ్యం, వీఏఏలు ప్రియాంక, వంశీకృష్ణ, వీహెచ్‌ఏ మల్లిక, ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.